Saturday, February 16, 2019

వెనుతిరగని వెన్నెల(భాగం-4) -డా||కె.గీత



జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థసహాయను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయినితన్మయికథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది.  
***
భాగం-4
సాయంత్రపు వెలుగు క్రమంగా మాయమవుతూ ఉందిపక్షులు గూళ్ళకి చేరుతూ కిలకిలారావాలు చేస్తున్నాయి.
డాబా పైకి పాకిన సన్నజాజి తీగె,  దానినల్లుకుని ఉన్న రాధాకృష్ణ తీగె పగలా రాత్రా అన్నట్లు పోటీ పడి విరబూసి ఉన్నాయి.
తన్మయి సన్నజాజి మొగ్గలు బుట్టలోకి కోసి వేస్తూ నిట్టూర్చింది.
పక్కనే ఉన్న వనజ “ఊరికే అదే పనిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు తనూశేఖర్ నిజంగానే నిన్ను ఇష్ట పడుతున్నాడేమోలవ్ ఎట్ ఫస్ట్ సైట్” అని కొంటెగా నవ్వింది.
తన్మయి “ఉహూనేనాలోచిస్తున్నది అది కాదుఅతను చదువుని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదన్నది నాకింకా అర్థం కావడం లేదుబహుశా ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల బాధ్యతలు అడ్డు వచ్చాయంటావా?” అంది.
నువ్వింకా అతని ఉత్తరం లో తప్పుల్ని నేను ఎత్తి చూపానని బాధ పడ్తున్నట్టున్నావ్నా ఉద్దేశ్యం అది కాదు” అంది వనజ.
సన్నజాజులు కోయడం పూర్తి చేసి దారపు రీలు లోంచి ఒక పెద్ద ముక్క నోటితో కొరికి వనజ చేతికిచ్చిందిమాల కట్టడానికి వీలుగా రెండు రెండు పూలని వనజకి అందిస్తూవీధి చివర దుమ్ము రేపుకుంటూ వస్తున్న రెండెడ్ల బండిని వెనుకే వస్తున్న మేకల మందని చూస్తూ “మనకంటే పశు పక్ష్యాదులు నయంవాటికి  బాధలూ లేవు కదూఅంది తన్మయి.
పూలు అల్లి,  మొదటి మాలని తన్మయి తలలో తురుముతూ “మనకీ  బాధలూ లేవు” అని నవ్వింది వనజ.
***
వారం రోజులనించీ ఆలోచిస్తూనే ఉంది తన్మయిశేఖర్ కి బదులివాలావద్దా అని. "ఇక  సాయంత్రం కాలేజీ నించి రాగానే మొదలుపెట్టాలి"  అనుకుంది.
మామూలుగానే తలకి బాగా కొబ్బరి నూనె పెట్టిబిగించి రెండు జళ్లు వేసింది జ్యోతి తన్మయికి.
రెడీ మేడ్ పంజాబీ డ్రెస్సులు అలా వీధిలోకి వస్తే  మధ్య రెండు ముదురు రంగులు కొంది జ్యోతి.  ఎప్పుడూ టైలరు దగ్గర కుట్టించిన పరికిణీలు  వేసుకునే తన్మయికి  డ్రెస్సులు బాగా నచ్చాయి.  అందులో ఎరుపు రంగు డ్రెస్సు తీసి వేసుకుందా రోజు తన్మయి.
కాలేజీ  లోపలికి వెళ్ళబోతూ గేటు దగ్గిర  పరిచయమైన ముఖం చూసి ఆశ్చర్యపోయిందిభయంతో పుస్తకాల్ని గుండెలకు ఇంకాస్త దగ్గరకు అదుముకుని అతన్ని పలకరించకుండానే లోపలికి వెళ్లిపోయింది.
క్లాసు రూముకి వెళ్లి పుస్తకాలలో తల దూర్చింది కానీఏవీ వినిపిస్తున్నట్లు లేదు.
"అతను ఇక్కడికి ఎందుకు వచ్చేడుఉత్తరం రాయలేదని ఏకంగా వెతుక్కుంటూ వచ్చేసేడాఇదంతా ఇప్పుడు ఇంట్లో తెలిస్తే,  అమ్మోఇంకేమైనా ఉందాముందెళ్లి అతన్ని ఇక మీదట ఇలా రావొద్దని చెప్పెయ్యాలిఅలా చెప్తే అతను బాధ పడ్తాడేమో." అని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తూంది.
"అతనికి నచ్చినానచ్చక పోయినా ఇదొక పెద్ద గొడవ కాక ముందే,  తనకి ఇలాంటివి నచ్చవని ఖరాఖండీగా చెప్పెయ్యాలి " అని నిశ్చయించుకుని క్లాసు మధ్యలో పర్మిషన్ అడిగి కాలేజీ బయటికి వచ్చింది తన్మయి.
తను ఊహించినట్లుగానే ఇంకా అక్కడే ఉన్నాడు అయితే  సారి ఎదురుగా బడ్డీ కొట్టు బెంచీ మీద కూచునిగేటు వైపే చూస్తూ కనిపించాడు.
తను బయటికి రావడం చూసి నడిచి ఎదురుగా వచ్చాడు.
చాలా మామూలుగా నవ్వుతూ "బావున్నావా?" అన్నాడు.
తన్మయి గొంతు పెగల్చుకునే లోగా  " చుట్టుపక్కల ఊళ్లలో  అమ్మే కోళ్ల దాణా  కొనడానికి తరచు నాన్నగారు వస్తుంటారు.  ఇప్పుడా డ్యూటీ నేను తీసుకున్నానుఎలాగూ వచ్చేను కదాఒక సారి నిన్ను చూసెళ్దామని వచ్చేను.  అని "వస్తానూ.." అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయేడు.
తన్మయికి మనస్సు స్థిమిత పడిందిసమస్య తననుకున్నంత కాంప్లెక్సు కానందుకు.
"అతనన్నీ డైరక్టుగా చెప్తున్నాడుమొన్న నిన్ను ఇష్ట పడ్డానని ఉత్తరం రాసేడుఇవేళ ఏకంగా నిన్ను చూడడానికి వచ్చేడుమరి రేపేవిటో..."అంది కనుబొమలు ఎగరేస్తూ వనజ.
" బిగించిన కొబ్బరి నూనె జడలులూజు పంజాబీ డ్రెస్సు చూసి ఇక మళ్లీ రాడులేఅంది తన్మయి.
పైకి అలా అందే కానీఅతను మరలా వస్తే బావుణ్నని అనుకుంది.
 సాయంత్రమే ఉత్తరం రాసి పోస్టు చేసింది.
"ప్రియమైన శక్కూ!
ఉభయకుశలోపరి.
తెలి వెన్నెల వేకువలో నీ ఉత్తరాన్ని వందో సారి చదివేను. "నువ్వు నాకు నచ్చేవుఅన్న నీ అక్షరాలు నా మనస్సులో శాశ్వతంగా ముద్రపడిపోయేయి.
నా ఇష్టాలేవిటో చెప్పనామంచు ఉదయాన గాలికి తలలూపే గరిక పూలంటేనూప్రతి పువ్వులోనూ ప్రపంచపు అందమంతా అల్లుకున్న దేవగన్నేరు పూలంటేనూ ఇష్టంగులాబీ పూల రేకుల మీద ముత్యపు చినుకుల్లా నిలిచిన నీహారికలంటే మరీ మరీ ఇష్టం.  అన్నిటినీ మించి శీతాకాలపు నును వెచ్చదనంలో లేత ఊదా రంగులో పొదలన్నీ నిండే డిసెంబరం పూలంటే ఇష్టం.
నువ్వెంత అదృష్టవంతుడివిఇంచక్కా పరవళ్లు తొక్కే గోదావరి సమక్షాన ఉన్నవునాకే గనుక అలాంటి అవకాశం ఉంటే గుండె ఘోషలన్నీ  రోజూ గోదారమ్మతో కలబోసుకోనూ!  అన్నట్లు నేను నిన్ను "శక్కూఅని పిలవడం నీకు నచ్చకపోతే చెప్పునాకిలా ముద్దు పేర్లతో పిలవడం అంటే ఇష్టం.
అవునూహఠాత్తుగా  అలా ప్రత్యక్షమయ్యే సరికి భయపడిపోయేను తెలుసామళ్లీ నిన్ను చూసేదెన్నడో అని మనసు ఘోషిస్తూందికానీ ప్రపంచపు భయం నన్ను వెనక్కు తగ్గమంటూందిఅందుకే ఏమీ మాట్లాడలేకపోయానుక్షమిస్తావు కదూ!
మరో ఉత్తరంలో మరిన్ని-
నీ
తను(ఇది నా  ముద్దు పేరు!)
ఉత్తరం పోస్టు చేసిన దగ్గర్నించీ అట్నించి వచ్చే ఉత్తరం కోసం ఎదురుతెన్నులు చూడడంతోనే సరిపోతూంది తన్మయికిఎందుకైనా మంచిదని ఉత్తరానికి మరో కాపీ రాసి దగ్గర పెట్టుకుందిఉత్తరానికి సమాధానం వచ్చినపుడు రెండూ దగ్గిర పెట్టుకుని చదువుకోవడం ఎంత బావుంటుంది!
ఉత్తరం వస్తే బావుణ్ణన్న సంతోషం ఒక పక్క నించీతీరా ఉత్తరం వచ్చేక  ఎవరి కంటనైనా పడ్తుందేమోనన్న ఆదుర్దా ఒక పక్క నించీ నిలవనీయడం లేదు తన్మయిని.
ఒక పక్క చదువుమీద నించి దృష్టి పక్కకి వెళ్లిపోకూడదని మనసుని తమాయించుకుంటూన్నా తన వల్ల కావడం లేదసలు.
మొత్తానికి మరో పదిహేను రోజుల్లో ఎదురు చూస్తున్న ఉత్తరం రానే వచ్చింది.
కాలేజీ నించి ఇంటికి వచ్చి ముఖం కడుక్కూంటూండగా నరసమ్మ ఉత్తరం తెచ్చి రహస్యంగా ఇచ్చింది తన్మయికి.
తన్మయి ఆశ్చర్యంగా అమ్మమ్మ వైపు చూసి అంతలోనే అటు వస్తూన్న తల్లికి కనబడకుండా దాచింది.
ఉత్తరం పట్టుకుని లోపలికి పరుగెత్తుతున్న తన్మయిని చూసి ముసిముసిగా నవ్వుకుంది నరసమ్మ.
తడబడే వేళ్లతో ఉత్తరం చింపిన తన్మయికి రెండే రెండు వాక్యాలు కనిపించి హుషారంతా పోయింది.
"నీ ఉత్తరం నాకు సగం అర్థమైందిసగం అర్థం కాలేదు.
ముఖ్య విషయం నేను వచ్చేవారం మళ్ళీ మీ ఊరొస్తున్నాను.
 సారి ఇంటికే వస్తాను."
ఇదా ఎంత గానో ఎదురు చూసిన ఉత్తరంఅసలే విషయానికీ బదులు లేదు.
 సాయంత్రం  శేఖర్ రాసిన ఉత్తరంవనజ తన ఉత్తరం కాపీ మార్చి మార్చి చూసి ”నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తానక్కకూనాగ లోకానికీ ఉన్నంత తేడాగా ఉన్నాయి మీ ఇద్దరి ఉత్తరాలు.” అని నవ్వుతూ
అతనికి నువ్వు రాసిన ఉత్తరం అర్థం కాకపోవడంలో నాకైతే ఏవీ ఆశ్చర్యం లేదు” అంది మళ్లీ.
"అంటే ఏవిటిఅతను నాకు సరిజోడు కాదనా నీ ఉద్దేశ్యం?” అంది ఉక్రోషంగా తన్మయి.
"అలా కోపగించుకోకుండా ఉంటే నేనింకో మాట చెబుతానుఅతనిని నువ్వు ఇష్ట పడడం లో తప్పు లేదుకానీ అతనికీ నీ హృదయం ఉంటుందని ఊహించుకోవడం లోనే తప్పు ఉందిఅంది వనజ సాలోచనగా.
అవన్నీ సరేలే ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడిందిఅతను మళ్లీ వస్తానంటున్నాడుపైగా ఇంటికిఅతని ఉద్దేశ్యం ఏవిటో నాకు  అర్థం కావడం లేదు.” అని తల పట్టుకుంది తన్మయి.
"సర్లే రానివ్వుఅతనికీ అర్థం కావాలిగా మీ ఇంటి పద్ధతులుఅయినా చుట్టాలబ్బాయి కదా వస్తే ఏమనుకోరని ధైర్యమనుకుంటా"  అంది వనజ.
***
శేఖర్ వస్తానన్న రోజు తెల్లారిందగ్గర్నించీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది తన్మయికి.
కాలేజీ లో ఉదయం నించీ ఏవీ తలకెక్కడం లేదు.
మధ్యాహ్నం నించి తలనొప్పిగా ఉందని పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేసిందిఎప్పుడూ చలాకీగా ఉండే తన్మయి ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉండడమే కాకుండా ముసుగు పెట్టి పడుకోవడం చూసి జ్యోతి వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది.
మనస్సులో చెలరేగుతున్న ఘర్షణకి తలపోటు నిజంగా రావడం మొదలైంది  తన్మయికి
వాకిట్లో  అలికిడి అయినా  అతనొచ్చాడేమో అని చెవులు రిక్కించి వింటూ ఉంది.
సాయంత్రం బయటి నించి వస్తూనే తన్మయి తండ్రి భానుమూర్తి "జ్యోతీఅబ్బాయి వచ్చాడు చూడుఅనడం విని చప్పున మంచం దూకి బాత్రూం లోకి పరుగెత్తింది తన్మయి.
ముందు గదికి ఆనుకుని ఉన్న హాలులోకి వచ్చేసరికి తండ్రితో మాట్లాడుతూ తన వైపే చూస్తున్న శేఖర్ ని చూడగానే చప్పున తలుపు చాటున దాక్కుంది.
నరసమ్మ ఏదో అర్థమైన దానిలా పక్కకు వచ్చి “నీకోసమే వచ్చినట్లున్నాడు” అంది ముసి ముసిగా నవ్వుతూ.
అతనికి సరిగ్గా కనిపించేటట్లు నిలబడి ఓర కంట చూసింది తన్మయిఅతను ఇంకా ఇటే చూస్తున్నాడు.
జ్యోతి టీ పట్టుకొచ్చి హాలులో తచ్చాడుతున్న తన్మయిని చూసి “నువ్వు పట్టుకెళ్తావా” అని అడిగింది.
లోపల్లోపల పొంగుతున్న సంతోషంతో తలూపిట్రే పట్టుకెళ్లింది తన్మయి.
ఇది మా అమ్మాయి” భానుమూర్తి శేఖర్ కి పరిచయం చేసేడు.
బదులుగా తలూపి “మొన్న పెళ్లిలో చూసేనండి”  అన్నాడు.
ఒక్క మాటా మాట్లాడే అవకాశం రాలేదు తన్మయికి.
వ్యాపారం పని మీద  ఊరు వచ్చేనని అతను చెప్తూన్నా ఇంటిలో ఎవరికీ నమ్మాలనిపించడం లేదన్న సంగతి గ్రహించింది తన్మయి.
మరో గంటలో అతను వెళ్లిపోగానే జ్యోతి  సీరియస్ గా లోపలికి వచ్చి "అతనెందుకు వచ్చాడు?" అంది తన్మయితో.
బిత్తరపోయి సమాధానం లేనట్లు నేల చూపులు చూసింది తన్మయి గొంతులో కూతురి ప్రమేయం లేకుండా పరాయి అబ్బాయి హఠాత్తుగా ఎందుకు వస్తాడనే గదమాయింపు ధ్వనిస్తూంది.
తన్మయికి ఏం చెప్పాలోఎలా చెప్పాలో అర్థం కాలేదు.
ఇంతలో నరసమ్మ వంటింట్లో  నించి వచ్చి “అదేవిటి కుర్రాడేవైనా పరాయి వాడామన దేవి కొడుకేగామొన్న పెళ్లి లో కనిపించినపుడు ఇటొస్తే వస్తూండమని నేనే చెప్పేను” అంది.
మనవరాలిని వెనకేసు రావడం కాదుపిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ముందు బాగా చదవమని చెప్పుఅని తన్మయి వైపు విసురుగా చూసి వెళ్లిపోయింది జ్యోతి.
తన్మయికి తను చేసిన తప్పేవిటో అర్థం కాలేదుఅలాగని అమ్మానాన్నలతో విడమర్చి మాట్లాడే ధైర్యమూఅవకాశమూ లేదు
అమ్మమ్మ నయమే బానే తప్పించబోయింది కానీ తనతో పరాయి అబ్బాయి గురించి చర్చించే ధైర్యం లేదు.
వనజ దగ్గరకు వెళ్లి గోడు వెళ్ళబోసుకుంది తన్మయి.
"...మీ ఇంట్లో అంత పోజిటివ్ గా రియాక్టవుతున్నట్లు లేరునువ్వు ఉత్తరాలు రాస్తున్నావని తెలిస్తే ఇంకాస్త మండి పడతారుముందు అతన్ని ఇలా వచ్చి కనబడొద్దని ఉత్తరం రాయిఅంది వనజ.
"మీ ఇంట్లో నుంచి ధవళేశ్వరం,  వాళ్ళ ఫ్రెండు షాపు కి ఫోను చేస్తేనోఅంది సాలోచనగా తన్మయి.
"అమ్మోఎస్.టీ.డీ కాల్ చేసేవంటే ఇంట్లో బిల్లు రాగానే చంపేస్తారుపోనీ టెలీగ్రాము ఇవ్వు." అంది వనజ.
టెలీగ్రాము పుచ్చుకుని ఏమనుకున్నాడో ఏమో మళ్లీ అటు నించి ఎటు వంటి రెస్పాన్సు లేదు రెండు నెలల వరకు.
తన్మయి కాస్త స్థిమితపడిందికానీ అతని గురించిన ఆలోచనలు వదలడం లేదు.
ఇంటర్మీడియేట్ పరీక్షలు అయిన వేసవిలో తన్మయి వనజ దగ్గరికి వెళ్లిఇంటికి వచ్చేసరికి ఇంట్లో హడావిడి కనిపించింది.
 *****
http://www.koumudi.net/Monthly/2015/april/april_2015_venutiraganivennela.pdf